అన్ని తెలుగు వార్తల సమాహారం

నత్త రూపంలో తలుపు తట్టిన అదృష్టం.. రాత్రికి రాత్రి రిచ్ అయిపోయిన మహిళ.. ఎలా అంటే

 

అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపుతడుతుందో ఎవ్వరూ చెప్పలేం అంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం ఒక గుణపాఠమే దానినుంచి నేర్చుకుంటూ



అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపుతడుతుందో ఎవ్వరూ చెప్పలేం అంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం ఒక గుణపాఠమే దానినుంచి నేర్చుకుంటూ..జీవితాన్ని గడిపెయ్యాలి. ఎదో ఒక రోజు.. ఎదో ఒక రూపంలో అదృష్టం వరిస్తుందని పెద్దలు అంటుంటారు..  అది నిజమే అనిపిస్తుంది ఈ సంఘటన చూస్తే. ఒక చిన్న నత్త ఓ మహిళ జీవితాన్నే మార్చేసింది. రాత్రికి రాత్రే కోటీశ్వరాలుని చేసింది. చిన్న నత్త ఆమె బాధలు, కష్టాలు ఎలా తీర్చిందో ఇప్పుడు చూద్దాం..

బ్యాంకాక్ లో జరిగింది ఈ విచిత్ర సంఘటన..  కొడ్చకార్న్ తాంతివిట్కుల్ అనే ఓ  మహిళ రెండు నెలల క్రితం భోజనం తాయారు చేయడానికి స్థానిక చేపల మార్కెట్‌ కు వెళ్ళింది. అక్కడ కొన్ని నత్తలను కొనుగోలు చేసింది. వాటిని తీసుకొని ఇంటికి వెళ్ళింది. వాటిని కట్ చేసి శుభ్రం చేస్తుండగా ఒక నత్త కడుపులో చిన్న గోలీ లాంటిది కనిపించింది. వెంటనే దానిని తన తల్లికి చూపించింది. తల్లి చెప్పిన విషయం విని కొడ్చకార్న్‌ షాక్ కు గురైంది. ఆనందంతో ఉబ్బితబ్బిపోయింది. ఆమెకు దొరికింది ఓ అరుదైన ముత్యం అని తెలిసి సంతోషంలో ఎగిరిగంతేసింది. ఆ ముత్యం అరుదైన మెలో జాతికి చెందినది. క్వాలిటీని బట్టి దాని ధర ఉంటుంది. ఈ ముత్యం కోట్ల రూపాయల ఖరీదు ఉంటుందని తెలుస్తుంది. కొడ్చకార్న్‌ మాట్లాడుతూ.. ‘‘నత్తలు శుభ్రం చేస్తుండగా ఓ రాయిలాంటిది దొరికింది.  ఆతర్వాత అది మెలో ముత్యం.. కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుందని తెలిసిందని తెలిపింది. ప్రస్తుతం దీ​న్ని కొనే వారి కోసం చూస్తున్నాను. వచ్చే డబ్బుతో క్యాన్సర్మా తో బాధపడుతున్న తన తల్లికి వైద్యం చేయిస్తానని అంది. ఆమె వైద్యం కోసం 23.34 లక్షల రూపాయలు అవసరం అవుతాయి’’ అని తెలిపింది. మొత్తానికి నత్త రూపంలో అదృష్టం ఆమెను వరించింది.

నత్త రూపంలో తలుపు తట్టిన అదృష్టం.. రాత్రికి రాత్రి రిచ్ అయిపోయిన మహిళ.. ఎలా అంటే నత్త రూపంలో తలుపు తట్టిన అదృష్టం.. రాత్రికి రాత్రి రిచ్ అయిపోయిన మహిళ.. ఎలా అంటే Reviewed by Manam Telugu Vaaram on 3:13 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.