అన్ని తెలుగు వార్తల సమాహారం

తాడిపత్రిలో ఉత్కంఠకు తెర.. చైర్మన్‌గా జేసీ ప్రమాణం

 




అనంతపురం: తాడిపత్రిలో ఉత్కంఠకు తెర పడింది. టెన్షన్‌ వాతావరణం నడుమ చైర్మన్‌గా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికవగా వైస్ చైర్మన్‌గా సరస్వతి ఎన్నికయ్యారు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికి తోడు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతివ్వడంతో ప్రభాకర్‌రెడ్డి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మూడు రోజుల క్రితం ఎమ్మెల్సీల ఎక్స్‌అఫీషియో ఓట్లను మున్సిపల్ కమిషనర్ తిరస్కరించిన నాటి నుంచి ఈ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు శిబిరాలను సైతం ఏర్పాటు చేశాయి. మొత్తానికి జేసీ ఎన్నికతో ఉత్కంఠకు తెరపడింది.


మా వాళ్లంతా ‘బహుబలి’లు

కాగా.. చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ..  తాడిపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తాడిపత్రిలో రౌడీయిజం... గుండాయిజం ఇక ఉండదన్నారు. సేవ్ తాడిపత్రి తమ నినాదంగా పేర్కొన్నారు. తమ కౌన్సిలర్లు అందరూ బాహుబలిలు, ఝాన్సీ లక్ష్మీబాయిలు అని జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు



ఈ ఎన్నికకు ముందు వేర్వేరు మార్గాల్లో మున్సిపల్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి చేరుకున్నారు. టీడీపీ, సీపీఐ, ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లతో మున్సిపల్‌ కార్యాలయానికి జేసీ చేరుకున్నారు. భారీ కాన్వాయ్‌తో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేరుకున్నారు. అనుమతి లేదంటూ పెద్దారెడ్డి కాన్వాయ్‌ను పోలీసులు నిలిపివేశారు. 

తాడిపత్రిలో ఉత్కంఠకు తెర.. చైర్మన్‌గా జేసీ ప్రమాణం తాడిపత్రిలో ఉత్కంఠకు తెర.. చైర్మన్‌గా జేసీ ప్రమాణం Reviewed by Manam Telugu Vaaram on 1:31 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.