అన్ని తెలుగు వార్తల సమాహారం

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేయాలనే దిశగా ప్రభుత్వం నిర్ణయించింది.

 




దీనివల్ల విద్యార్థులకు యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌ అలవడుతుంది.. దీని వల్ల భవిష్యత్‌లో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సర్కారు భావిస్తోంది. ముఖ్యంగా ఉన్నత తరగతులకు చేరుకునే సమయానికి విద్యార్థుల్లో లాంగ్వేజ్‌ నైపుణ్యాలు.. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తోపాటు.. అకడమిక్‌గా ఆయా సబ్జెక్టుల్లో విస్తృత అవగాహన లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా జేఈఈ, నీట్‌ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో.. మన విద్యార్థులు మరింత ముందంజలో నిలిచే అవకాశం ఉంది! నేపథ్యంలో.. సీబీఎస్‌ఈ సిలబస్‌ వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు.. సిలబస్‌ ప్రత్యేకతలు.. బోధన విధానాలపై ప్రత్యేక విశ్లేషణ..

క్లాస్‌ రూమ్‌లు మార్కుల కర్మాగారాలుగా మిగిలిపోకూడదు. విద్యార్థుల్లోని సృజనా త్మకతను,ఆలోచన శక్తిని పెంపొందించే విధంగా చదువులు ఉండాలి. ఫలితంగా విద్యార్థులు భవిష్యత్తులో ఎదురయ్యే పోటీని తట్టుకొని.. లక్ష్య సాధనలో ముందంజలో నిలిచేందుకు అవకాశం ఉంటుంది.’–నేటి విద్యా వ్యవస్థ, ప్రస్తుత మార్కుల సంస్కృతిపై విద్యావేత్తలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది. మేధావుల ఆలోచనలకు అనుగుణంగా కరిక్యులం, బోధన, లెర్నింగ్‌ విధానాల ద్వారా విద్యార్థుల్లో సృజనా త్మకతకు దోహదపడుతోంది సీబీఎస్‌ఈ సిలబస్‌. అందుకే సీబీఎస్‌ఈ సిలబస్అంటే దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక స్థాయిలో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేయాలని నిర్ణయించింది. మొదట ఒకటి నుంచి ఏడు తరగతుల వరకు.. తర్వాత దశల వారీగా 2024–25 నాటికి పదో తరగతి వరకూ... సీబీఎస్‌ఈ సిలబస్‌ విధానం అమలు చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది.

ప్రాక్టికాలిటీకిప్రాధాన్యం:
సీబీఎస్‌ఈ సిలబస్‌లో టీచింగ్‌లెర్నింగ్‌ కోణంలో ప్రాక్టికాలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా కరిక్యులం అమలవుతుంది. అంటే.. సీబీఎస్‌ఈ విధానంలో విద్యార్థులు క్లాస్‌ రూం బోధనకే పరిమితం కాకుండా.. తాము తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించి చూసేలా ప్రోత్సహిస్తారు. అంతేకాకుండా పాఠశాలల్లోనే చిన్నపాటి ఎగ్జిబిషన్లు, ఎడ్యుకేషన్‌ ఫెయిర్స్‌ నిర్వహిస్తూ.. విద్యార్థుల్లో ఆయా అంశాల పట్ల అవగాహనను ప్రాక్టికల్‌గా అన్వయించే విధానం కూడా అమలవుతోంది

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేయాలనే దిశగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేయాలనే దిశగా ప్రభుత్వం నిర్ణయించింది. Reviewed by Manam Telugu Vaaram on 5:49 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.