అన్ని తెలుగు వార్తల సమాహారం

తెలంగాణ బీజేపీకి గట్టి షాకివ్వనున్న పవన్...? సాగర్ ఉపఎన్నికలో జనసేన పోటీ చేసే యోచన..?

 తెలంగాణ బీజేపీ నాయకత్వం తమను పెద్దగా పట్టించుకోవట్లేదని ఇటీవల బాహాటంగానే విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఆ పార్టీకి మరో షాకిచ్చేందుకు సిద్దమవుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక అభ్యర్థి కోసం తెలంగాణ బీజేపీ కసరత్తులు చేస్తున్న వేళ... జనసేన కూడా అక్కడ పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన కమిటీని ఆ పార్టీ ప్రకటించడం ఇందుకు ఊతమిస్తోంది.






ఇరువురిలో తీవ్రమైన అసంతృప్తి... ప్రతీసారి బీజేపీ తమను వాడుకుని వదిలేస్తోందని... తమను సరైన గౌరవం ఇవ్వట్లేదని ఇటీవల పార్టీ ఆవిర్భావ వేడుకలో జనసేనాని వాపోయిన సంగతి తెలిసిందే. అంతేకాదు,ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణికి మద్దతునిచ్చి బీజేపీకి షాకిచ్చారు. దీంతో పవన్ తీరుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు మద్దతునిచ్చి... ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతునివ్వడమేంటని ప్రశ్నించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే.. తమ దృష్టికి తీసుకురావాల్సిందని చెప్పారు.

జనసేన-బీజేపీ మధ్య పెరిగిన గ్యాప్... తెలంగాణ బీజేపీ-జనసేన మధ్య చాలా గ్యాప్ ఉందని బండి సంజయ్,పవన్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. బీజేపీలో ఎంపీ ధర్మపురి అరవింద్,డీకే అరుణ లాంటి నేతలు జనసేనతో పొత్తు విషయంలో గతంలో చేసిన చులకన వ్యాఖ్యలు ఆయన్ను నొచ్చుకునేలా చేశాయని తెలుస్తోంది. జనసేనతో అసలు తమకు పొత్తే లేదని జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ధర్మపురి అరవింద్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. డీకె అరుణ కూడా అవే వ్యాఖ్యలు చేశారు. నిజానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావించినప్పటికీ... ఓట్లు చీల్చవద్దన్న ఉద్దేశంతో పవన్ బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీజేపీ కోసం తాము పోటీ నుంచి తప్పుకుని త్యాగం చేసినప్పటికీ... ఆ పార్టీ నేతలు జనసేన పట్లు చులకన వ్యాఖ్యలు చేయడం,గెలిచాక తమను పెద్దగా పట్టించుకోకపోవడం పవన్‌ను బాధించినట్లు తెలుస్తోంది.


తెలంగాణ బీజేపీకి గట్టి షాకివ్వనున్న పవన్...? సాగర్ ఉపఎన్నికలో జనసేన పోటీ చేసే యోచన..? తెలంగాణ బీజేపీకి గట్టి షాకివ్వనున్న పవన్...? సాగర్ ఉపఎన్నికలో జనసేన పోటీ చేసే యోచన..?  Reviewed by Manam Telugu Vaaram on 5:25 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.